ఈ మద్య మన స్టార్ హీరోలు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఐతే ఇప్పటివరకు తన కెరీర్‌లో అధిక శాతం నటనకే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారిగా శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారి సినిమాల్లో పెట్టుబడిపెట్టారు. స్టార్ హీరో అదృష్టం కొద్దీ, మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి అటు హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత తాజాగా మహేష్ బాబు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఫిలిం నగర్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం మహేష్ బాబు థియేటర్స్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్టు సమాచారం.
ఏషియన్ థియేటర్స్‌కి చెందిన సునీల్ నారంగ్‌తో మహేష్ బాబు చర్చలు జరుపుతున్నట్టుగా సినీవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. మొదటి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 25 థియేటర్స్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారనేది ప్రచారం.ఐతే ఇది ఎంతవరకు నిజం అనేది అని మనకి త్వరలో తెలియబోతుంది


