యాంకర్ ఉదయభాను... తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో యాంకర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఉదయభాను ఒకరు. యాంకర్ గా, పలు టీవీ కార్యక్రమాల హోస్ట్ గా మాత్రమే కాదు... నటిగా కూడా ఆమె కొన్ని సినిమాలు చేసారు.
అయితే ఈ మధ్య ఉదయభాను ఏ టీవీ కార్యక్రమంలోనూ కనిపించడ లేదు. అందుకు కారణం ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కవల పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీ అయిపోయారు. గతేడాది ఆగస్టు 28న ఉదయభాను ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చారు. ఒకరికి యువి నక్షత్ర, మరొకరికి భూమి ఆరాధ్య అనే పేరు పెట్టారు. ఇప్పుడు పిల్లలతో బిజీగా ఉన్న ఉదయభాను మీద ఒక లుక్ వేద్దాం.

