టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ‘బాహుబలి’ సినిమా కోసం తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్న ప్రభాస్ పెళ్లికి సిద్దం అయ్యాడు. ఇదే సమయంలో ప్రభాస్‌కు మంచి స్నేహితురాలు మరియు బాహుబలి హీరోయిన్ అయిన అనుష్క కూడా పెళ్లికి సిద్దం అయ్యింది. వీరిద్దరు విడి విడిగా పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరి వివాహం దాదాపుగా కొన్ని రోజులు అటు ఇటుగా ఉండే అవకాశాలున్నాయని సినీవర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబ సభ్యులు చాలా కాలంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘బాహుబలి’ రెండవ పార్ట్ విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే పెళ్లి చేసేయాలని కృష్ణంరాజు మరియు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకు ప్రభాస్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అనుష్క కూడా ఇంట్లో వారి పోరు భరించలేక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గతంలో ఒక వ్యాపార వేత్తతో అనుష్క వివాహం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అవన్ని ఒట్టి పుకార్లే అంటూ అనుష్క కుటుంబ సభ్యులు ప్రకటించారు.
అనుష్క వివాహం ఇదే సంవత్సరం ఖచ్చితంగా అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా ఇదే సంవత్సరం అవ్వబోతుంది. వీరిద్దరు ‘బాహుబలి’ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. తమ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వారిద్దరు ఒకేసారి వేరు వేరుగా పెళ్లికి సిద్దం అవుతున్నారు. వీరి పెళ్లి అభిమానులకు పండుగను తీసుకు రానుంది.