సీనియర్ నటి వాణిశ్రీని సొంత మనుషులే మోసం చేశారట. హీరోయిన్ గా తాను బిజీగా ఉన్నప్పుడు, తన ఆస్తిపాస్తులను చూసుకోమంటూ తన అక్కాబావలకు భాధ్యతలను అప్పగించిందట వాణిశ్రీ. హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు వెళ్లడంతో, ఆమె ఆస్తులు కూడా అంతకంతకూ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, నమ్మకద్రోహం చేస్తూ ఆమె అక్కాబావలు ఆమె ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేశారట.
దీంతో, తన ఆస్తులను కాపాడుకోవడానికి ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల అనంతరం తన ఆస్తిని తనకే ఇచ్చేరని వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే, తన సొంత మనుషులే తనను మోసం చేయడానికి ప్రయత్నించడం తనను ఎంతగానో బాధించిందని వాణిశ్రీ చెప్పింది.

