సినిమాకు పాటలు ఆక్సిజన్ లాంటివి. పాటలు బాగుంటే సినిమా సగం విజయవంతమైనట్టే. అయితే సినిమాకు భారీగా ఖర్చుపెట్టే నిర్మాతలు సింగర్స్ వద్దకు వచ్చే సరికి బాగా పిసినారులైపోతారట. ఒక సినిమాకు పాడడం కంటే సీరియల్‌కు పాడితే ఎక్కువ మొత్తం వస్తుందట. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సింగర్ ప్రణవి.
‘ఇప్పటి సింగర్స్‌కు ఒక్కో పాటకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వెయ్యి రూపాయలకు, రెండు వేలకు కూడా పాడమని అడుగుతుంటారు కొంతమంది నిర్మాతలు. అయితే ఉచితంగా పాడడానికి కూడా ఎంతో మంది సింగర్స్ సిద్ధంగా ఉన్నారు. సినిమాల కంటే సీరియల్స్, జింగిల్స్‌కు పాడినపుడే ఎక్కువ డబ్బులు వస్తాయి.
సీరియల్‌కు పాడినప్పుడు రూ. 30వేలు వస్తే.. సినిమాకు పాడినపుడు ఐదు వేలే వస్తాయి. అయితే తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు మాత్రం నాకు 15 వేల రూపాయలు ఇచ్చారు. కేవలం పాపులర్ అవడానికే పాటలు పాడుతున్నారు ఇప్పటి గాయకులు. ఆ సంస్కృతి పోయేంత వరకు సింగర్స్‌కు మంచి రోజులు రావ’ని ఆవేదన వ్యక్తం చేసింది ప్రణవి.


