నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ తదితరులు
సంగీతం: ఏ ఆర్ రహమాన్
నిర్మాత: నల్లమలుపు బుజ్జి, టాగోర్ మధు
దర్శకత్వం: శ్రీను వైట్లా
శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్ గా నటించిన “మిస్టర్” సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. కొన్ని ఫ్లాప్స్ తో గత కొంతకాలంగా శ్రీను వైట్ల కొంత వెనక్కి తగ్గినా, ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళి తన సక్సెస్ తో ముందుకు వెళ్లాలని చాలా పట్టుదలగా తీసిన సినిమా ఎలా ఉందొ కథలోకి వెళ్లి చూద్దాం…
కథ..
పిచ్చయ్య నాయుడు (చై) (వరుణ్ తేజ్) ఒక ట్రవెల్లెర్. లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. “స్పెయిన్” ట్రిప్ కు వెళ్ళినప్పుడు “మీరా” (హేభ పటేల్) తో పరిచయం ఆతర్వాత ప్రేమలో పడటం జరుగుతుంది. ఇలా వీళ్ళ లవ్ స్టోరీ నడుస్తూ ఉండగా, సడన్ గా వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు రావడం… ఆ కారణంగా హీరో ఇండియా వచ్చి తన సొంత ఊరు వెళ్ళాల్సి వస్తాది. అక్కడ మరో హీరోయిన్ చంద్రముఖి” (లావణ్య త్రిపాఠి) ఒక పల్లెటూరి అమ్మాయి కలుస్తుంది. కొన్ని రోజులకు ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరిలో ఎవరి ప్రేమ స్వచ్ఛమైందో, నిజమైందో తెలుసుకుందాం అనుకుంటాడు. ఎవరి ప్రేమ నిజమైనదో, ఎవరిని పెళ్లి చేసుకుంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
సినిమా ఎలా ఉందంటే….
“శ్రీను వైట్ల” అంటే కేవలం కామెడీ సినిమాలే కాదు. లవ్ రొమాంటిక్ ఎమోషనల్ సినిమాలు కూడా తీయగలరు అని నిరూపించుకున్నారు. వరుణ్ తేజ్ కూడా ఇటువంటి పాత్ర చేయడం మొదటిసారి.లవర్ బాయ్ గా, లైఫ్ ని ఎంజాయ్ చేసే పాత్రలో చాలా చక్కగా నటించాడు. హీరోయిన్స్ గ్లామర్ తో సినిమాకి మంచి ఊపు వచ్చింది. ఫ్యామిలీ డ్రామా బాగుంది. మ్యూజిక్, ఫైట్స్ ఆకట్టుకోలేకపోయాయి. సెకండ్ ఆఫ్ కొంత సాగినట్టు అనిపిస్తుంది. సినిమాకు కథ, స్క్రీన్ప్లే, ఫామిలీ బాక్గ్రౌండ్ మంచి ప్లస్ అయ్యాయి. అందరు పెద్ద పెద్ద నటులతో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా బాగానే ఉంది.
రేటింగ్..2.5/5


