కావలసినవి:
శనగపప్పు ,మినప గుళ్ళు, ఎండు మిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్, టమాటో, ఉప్పు ,కారం ,పోపు సామాన్లు.
చేసే విధానం:
ముందుగా పాన్ వేడి చేసుకొని రెండు మూడు స్పూన్ల నూనె వేసి, దాంట్లో ఒక స్పూను పచ్చి శనగగపప్పు, ఒక్క స్పూను మినప గుళ్ళు, పది ఎండు మిరపకాయలు వేసి వేగించుకోండి. ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ముక్కలు చేసుకొని వేగించుకోండి.
బాగా ఎర్రగా వేగనవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. అందులో ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు , మూడు క్యారెట్ ముక్కలు వేసుకోండి .ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా ని కూడా ముక్కలు చేసి వేసుకోవాలి.
కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకోండి. చల్లారిన తర్వాత ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకొని, మిక్సీ జార్లో బాగా పేస్ట్ చేసుకోండి. చట్నీ, గిన్నెలోకి తీసిన తర్వాత జార్లో ఉన్న దాన్ని వాటర్ తోటి కన్సిస్టెన్సీ చూసుకోండి. దానికి కొంచెం తాలింపు తగిలించుకోండి. ఇది బ్రేక్ ఫాస్ట్ లోకి చాలా బాగుంటుంది