Kalonji Seeds Tea Benefits in telugu: ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చెప్పే టీ ప్రతి రోజు తాగితే కీళ్ల నొప్పులు, అధిక బరువు, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.
ఈ టీ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అర స్పూన్ కలోంజీ విత్తనాలు, అర స్పూన్ వాము వేసి నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి.. కొంచెం బెల్లం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ విధంగా తాగటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్లోరణలో ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ టీ తాగటం వలన శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ Tea తయారు చేసుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.