
ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మిక్సీ జార్ లో నాలుగు తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
ఆ తర్వాత మూడు మందార పువ్వుల రేకలను వేయాలి. ఆ తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత కొంచెం నీటిని పోసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి వడకట్టాలి.
ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల henna పొడి వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక నార్మల్ నీటితో శుభ్రం చేసుకొని...మరుసటి రోజు కుంకుడు కాయలు లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.