ఈ మధ్యకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య అలాగే జుట్టు రాలే సమస్య అనేవి కనబడుతున్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మందార పువ్వులు చుండ్రు సమస్యను జుట్టు రాలే సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
రెండు మందార పువ్వులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రెండు చుక్కల బాదం నూనె, రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి రెండు గంటల తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు,జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


