మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, మారిన ఆహారపు అలవాట్లు, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం, సరైన నిద్ర లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంది.
పొట్ట బాగా పెరిగిపోయి బాన పొట్టగా కనబడుతుంది. ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తీసుకుంటే బాన పొట్టకు నెల రోజుల్లో గుడ్ బై చెప్పవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ సోంపు గింజలు, అర స్పూన్ టీ పొడి, రెండు నిమ్మ కాయ ముక్కలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక స్పూను తేనె కలిపి ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు లేదంటే రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకోవచ్చు. ఈ డ్రింక్ ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
అలాగే బరువు తగ్గడమే కాకుండా మోకాలు నొప్పులు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేసి మలబద్దకం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు. ఈ సమస్యల కారణంగా కూడా పొట్ట బాగా పెరుగుతుంది.


