Cholesterol :రక్తంలో కొల్లెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు బాగా పెరిగిపోయాయని మీకుఇష్టమైన ఆహారాలను తినటం ఆపేసారా? మీరు ఆపాల్సిన అవసరం లేదు. మంచి కొలస్ట్రాల్ తో భర్తీ చేయవచ్చు.
రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువైతే దానిని మంచి కొలస్ట్రాల్ ఆహారాలతో సులభంగా తొలగించవచ్చు. అయితే మన శరీరంలో మంచి కొలస్ట్రాల్ ఉండాలంటే ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం.
ఆరెంజ్ జ్యూస్ - ఇంటిలో తాజాగా తయారుచేసుకునే ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యుస్త్రా గితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
వెల్లుల్లి - మనం ప్రతి రోజు ఉపయోగించే వెల్లుల్లిలో మంచి కొలస్ట్రాల్చా లా ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తనాళాలలోని లోపలి అంచులు గట్టిపడకుండా చేస్తుంది. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చూస్తుంది.
అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిదని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.
రెడ్ వైన్ - ఆల్కహాల్ తాగటం అలవాటు లేని వారికి కూడా ఇది బాగుంటుంది. ఇది ఇంచుమించుగా ద్రాక్షరసంతో సమానం. కొల్లెస్టరాల్ స్ధాయిలను సాధారణ స్థితిలో ఉండేలా చూస్తుంది.
అయితే రెడ్ వైన్ ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఎప్పటి కపుడు శుభ్రపడి రక్త సరఫరా ఫ్రీ గా జరిగేలా చూస్తుంది.


