ఎదుటి వ్యక్తులను ముందుగా ఆకట్టుకోనేవి కళ్ళు.కళ్ళు మన ఆలోచనలకు, ఆరోగ్యానికి ప్రతిబింబాలు. ఆలోచనల ప్రబావం, ఆరోగ్య ప్రబావం అనేవి ముందుగ కళ్ళ మీదే పడుతుంది. దాని పలితంగా కళ్ళ చుట్టూ నల్లని చారలు ఏర్పడి కళ్ళ అందాన్ని దెబ్బతీస్తాయి.
చాలా మందిలో కనిపించే ఈ సమస్యకు ఇంటి వైద్యం ఉత్తమమైనది. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించటం ద్వారా కళ్ళను అందముగా ఉంచుకోవచ్చు.
బాదం నూనె,తేనే సమభాగాలలో తీసుకోని నల్లని వలయాల మీద రాత్రి సమయంలో అప్లై చేసి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి.
చల్లని టీ బ్యాగ్లను ఒక్కో కంటి మీద పది నుంచి పదిహేను నిముషాలు పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే తొందరగా నల్లని చారలు తగ్గుతాయి.
తాజా పుదినా ఆకులను నూరి దానికి రెండు చుక్కల నిమ్మరసం కలిపి నల్లని వలయలపై రాయాలి. ఈ విధంగా మూడు వారాల పాటు చేయాలి.
కొద్దిగా రోజ్ వాటర్ ను గిన్నెలోకి తీసుకోని దానిలో దూది ముంచి నల్లటి వలయాల మీద సున్నితంగా మర్దన చేయాలి. ఈ విధంగా 10 నుంచి 15 నిముషాలు చేయాలి.
కీరాను గుండ్రని ముక్కలుగా కోసి వాటిని కంటి మీద పెట్టుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇవి కంటి అందాన్ని మళ్లీ తీసుకురావటంతో పాటు అలసిన కళ్ళకు విశ్రాంతిని ఇస్తాయి.


