Coriander Health Benefits:రోజూ కొత్తిమీర తినడం వల్ల ఎన్నోప్రయోజనాలు, మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు

Coriander Leaves Health Benefits : కొత్తిమీరను కూరల్లో కొంచెం మాత్రమే వేస్తాం. కొన్నిసార్లు వేసినా, వేయకపోయినా ఒకటేనని అనుకుంటాం. అది కేవలం రుచికి, సువాసన కోసమే అని అనుకుంటాము. కానీ దానిని ఆహారంలో నిత్యం తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దానిలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది.దానిలో ఉండే డొడిసెనోల్‌ అనే పదార్థం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.

1. ఒక గ్లాసుడు మజ్జిగలో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం కానీ, రాత్రి పడుకొనే ముందు కానీ తీసుకుంటే... శరీరానికి విటమిన్‌ 'ఎ', 'బి1', 'బి2', 'సి', ఇనుము సమృద్ధిగా అందుతాయి. అవి శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.

2. అజీర్ణంతో బాధపడేవారు.. ఈ రసంలో, జీలకర్ర, నిమ్మరసం చిటికెడు ఉప్పు కలిపి పుచ్చుకుంటే మంచిది.

3. గర్భిణులు రోజూ రెండు మూడు చెంచాల రసం... నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి.

4. కడుపులో మంట, పేగుపూత గలవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.

5. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలున్నవారు ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. కామెర్లు వచ్చినపుడు పథ్యంగా దీన్ని కూరల్లో వేసి తీసుకొంటే త్వరగా కోలుకుంటారు.

6. కొత్తిమీరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉన్నది. ధనియాలను చారులా కాచి తీసుకుంటే విరేచనాలు, జ్వర తీవ్రత తగ్గుతాయి.

7. నెలసరి సమయంలో అధికంగా రుతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండుసార్లు పుచ్చుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top