Instant బాదం పౌడర్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుపుకోవచ్చు ఈజీగా ఉంటాయి. బాదం పప్పులు నానబెట్టనవసరం లేకుండా పంచదార మిక్సీ పట్టే అవసరం లేకుండా అన్ని ఒకేసారి instant గా పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు.
కావలసినవి:
ఒక కప్పు పొట్టు తీసిన బాదం పప్పులు , గార్నిష్ కి 10 జీడిపప్పులు, 10 బాదంపప్పులు, పది పిస్తా పప్పులు, ఒకటిన్నర కప్పు పంచదార, నాలుగు యాలకులు.
చేసే విధానం:
అర లీటర్ నీళ్లను మరిగించుకుని, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక కప్పు బాదం పప్పును వేసుకోండి. కలుపుతూ ఉండండి. ఒక్క నిమిషం అయ్యాక ఒక పప్పుని తీసి తొక్కు వస్తుందో లేదో చూసుకుంటే తెలుస్తుంది .వస్తుందని అనుకున్నప్పుడు ఆ వాటర్ ని drain చేసుకోండి. కానీ ఫాస్ట్ గానే బాదంపప్పు తొక్కని తీసి వాటిని ఒక క్లాత్ మీద పెట్టుకోండి.
ఒక్కొక్కటి తీయడం కష్టంగా ఉంటే ఆ క్లాత్ లో అన్ని బాదం పప్పులు వేసేసి మన చేతితో రబ్ చేస్తే తొక్కంతా ఊడిపోతుంది. నిమిషంలో పప్పులు రెడీ అయిపోతాయి. ఒక పాన్ తీసుకొని ఈ వలచుకున్న బాదంపప్పుని పాన్ లో వేసుకోండి. నూనె వేయకూడదు. లో ఫ్లేమ్ లోనే ఉంచి కలర్ మారేవరకు కలుపుతూ వేగించాలి.
వాటిని ఒక పళ్లెంలో వేసి చల్లార పెట్టుకోండి .మళ్లీ అదే పాన్ లో ఒక పది జీడిపప్పులు , ఒక పది బాదంపప్పులు, ఒక పది పిస్తా పప్పులు వేసుకొని లో ఫ్లేమ్ లో లైట్ గా వేయించుకొండి. పిస్తా పప్పుని కొంచెం చేత్తో rub చేసుకుంటే పొట్టు రాలిపోతుంది .ఈ వేపిన పప్పుల్ని సన్నగా కట్ చేసుకోండి .
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బాదంపప్పు తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ ఆఫ్ కప్పు షుగర్ తీసుకోండి, ఐదు యాలకులు, హాఫ్ స్పూన్ పసుపు, వేసి బాగా మెత్తగా పొడి చేసుకోండి. ఈ పంచదార పొడిలో పొట్టు తీసి వేగించుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒకసారి మొత్తం పిండి కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి.
ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు ని కూడా ఈ పౌడర్ కి కలుపుకోండి. ఇక్కడ పంచదార బదులు పటిక బెల్లం తీసుకోండి, అది మీ ఆప్షన్ .ఈ పౌడర్ ఫ్రిజ్లో పెట్టుకుంటే 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు.
ఒక గ్లాస్ పాలు మరిగించి ఒక రెండు స్పూన్లు పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ కూడా మరిగే పాలల్లో వేసి రెండు మూడు పొంగులు రానిచ్చి చల్లారి పెట్టుకుంటే మీకు కూల్ గా కావాలంటే కూల్ గా hot గా కావాలంటే hotగా తీసుకోని ఎంజాయ్ చేయండి.


