Protein rich Foods:1 లడ్డు తింటే చాలు కీళ్ళనొప్పులు,,అలసట,నీరసం అసలు ఉండవు


Protein rich Foods :నువ్వుల్లో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒమేగా 3,6,9 ఆమ్లాలను కలిగి ఉంటుంది . రాగి పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఎన్ని రకాల వంటలను చేసుకోవచ్చు.

రాగి సంకటి, రాగి చపాతీ ,దోస ఇవే కాకుండా స్వీట్లు కూడా చేసుకోవచ్చు. ఇకపోతే బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. ఒక్కొక్క పదార్థానికి ఇంత విశిష్టత ఉండగా మూడు కలిసిన ఒక స్వీట్ అదే లడ్డు ఎనర్జీ లడ్డులో ఇంకా ఎంత శక్తి ఉంటుందో అది ఎలా చేయాలో చూసేద్దాం.

కావలసినవి:

ఒక కప్పు నువ్వు పప్పు,అర కప్పు రాగి పిండి,ఒక కప్పు బెల్లం,కొంచెం ఇలాచి పౌడర్,-రెండు స్పూన్లు నెయ్యి

చేసే విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె లేకుండా నుపప్పును మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే బాండీలో రాగి పిండిని రెండు స్పూన్లు నెయ్యి వేసి వాసన పోయే వరకు దోరగా వేయించాలి. నువ్వుపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి.

మూడు కలిపిన మిశ్రమం అంటే బెల్లం, రాగిపిండి, నువ్వులు పొడి మూడు ఇలాచీ తో కలిపి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. నువ్వు పప్పులో నూనె ఉంటుంది... కాబట్టి ఆ తేమతో అది ముద్దవు తుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే ఇష్టంగా తినొచ్చు. .

పిల్లలు ఎదుగుదలకు బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం రోజు ఒక లడ్డు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top