Chapped lips Home remedies in telugu: పెదవులు అనేవి ముఖానికి అందాన్ని ఇవ్వటమే కాకుండా, శరీరంలో ఉన్న మిగతా బాగాల కన్నా అతి సున్నితంగా ఉంటాయి. అందువలన వీటిని ఏ కాలంలోనైన తప్పనిసరిగా సంరక్షణ చేయాలి. సహజంగా ఇంటిలో లభించే వస్తువులతో పెదవుల సంరక్షణ గురించి తెలుసుకుందాం.
ఇంటిలో తీసిన వెన్న లేదా కాచిన నెయ్యిని పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇది సహజసిద్దమైన లిప్ బామ్ వలే పనిచేసి పెదవుల సున్నితత్వాన్ని మరియు అందాన్ని కాపాడుతుంది.
పగిలిన పెదవులకు తేనే బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకొనే ముందు పెదవులకు తేనే రాసుకుంటే పెదవులను పగుళ్ళ నుండి రక్షించుకోవచ్చు.
పాల మీగడను పెదవులకు అప్లై చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. చర్మంలోని మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేయటానికి మీగడ దోహదం చేస్తుంది. అలాగే ప్రతి రోజు పెదవులకు మీగడ రాయటం వలన పెదవుల మెరుపును కాపాడుకోవచ్చు.
టీ బ్యాగ్ లను మరిగే నీటిలో ముంచి తీసాక, చల్లారిన తర్వాత ఆ బ్యాగ్ ను పెదవులపై బలంగా రుద్దాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే పెదవుల పగుళ్ళ నుండి తప్పించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


