Dal Masala Vada: మసాలా వడలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఈ రోజు మనం మూడు పప్పులతో మసాలా వడలను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. మసాలా వడ చాలా రుచిగా ఉంటుంది.
కావలసినవి
1/3 కప్పు మినపప్పు
1/3 కప్పు శనగపప్పు
1/3 కప్పు కందిపప్పు
1 టేబుల్ స్పూన్ సోంపు
1 టేబుల్ స్పూన్ జీలకర్ర
1 అంగుళం అల్లం
6-7 వెల్లుల్లి రెబ్బలు
ఉ ప్పు సరిపడా
3-4 పచ్చిమిర్చి
1/4 కప్పు కొత్తిమీర (తరిగిన)
2 ఎండు మిరపకాయలు
2 రెమ్మలు కరివేపాకు
1/2 కప్పు ఉల్లిపాయలు (తరిగిన)
1/4 కప్పు పుదీనా (తరిగిన)
నూనె (వేయించడానికి)
తయారి విధానం
ఒక గిన్నెలో మినపప్పు,కందిపప్పు,శనగపప్పు వేసి నీటిని పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. నానిన పప్పులలో నీటిని తీసివేసి, గుప్పెడు పప్పును పక్కన పెట్టి , మిగతా పప్పును మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత సోంపు,జీలకర్ర,పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మరియు ఎండు మిర్చితో కలిపి ముతకగా మిక్సీ చేయాలి.
ఒక పెద్ద గిన్నెలో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర మరియు ఉప్పు, మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కలపాలి. గ్రైండ్ చేసే ముందు పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసి బాగా కలపాలి.
అరచేయిని తడి చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజు మిశ్రమాన్ని తీసుకుని అరచేతిలో పెట్టి వడ మాదిరిగా వత్తి నూనెలో వేసి మీడియం మంట మీద gold కలర్ వచ్చే వరకు వేగించాలి.


