ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఒక పైనాపిల్ తీసుకుని పై తొక్కను తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక కీర దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పైనాపిల్ తొక్క ముక్కలను వేసి ఎనిమిది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, కీరా ముక్కలు నాలుగు పాలకూర ఆకులు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, పైనాపిల్ తొక్కల నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమమును వడగట్టి జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ నిమ్మరసం వేసి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజుగ్గా మారతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.