పల్లి పేస్టుతో చెక్కలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. అల్లం కారం వేసి చేసుకునే వడలు, సగ్గుబియ్యంతో , ఇప్పుడు పల్లీలతో టెస్ట్ చేసి ఎలా ఉందో చూడండి .పల్లీ, అల్లం పేస్టు తో flavour చాలా బాగుంటుంది.
కావలసినవి:
2 tbsp - పచ్చిశనగపప్పు, పల్లి మసాలా కోసం - 10 - ఎండు మిరపకాయలు, రెండు ఇంచుల అల్లం ముక్క, 10 - వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు వేయించిన పల్లీలు పొట్టు తీసినవి, రెండు కప్పుల బియ్యప్పిండి ,రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర , రెండు టేబుల్ స్పూన్ల వెన్న, గుప్పెడు కరివేపాకు.
చేసే విధానం:
ముందుగా శనగపప్పుని ఒక రెండు గంటల పాటు నానబెట్టి ఉంచుకోండి. తర్వాత పల్లీ పేస్ట్ కోసం ఎండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, పొట్టు తీసిన పల్లీలు కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో బియ్యప్పిండి వేసి అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పల్లీ పేస్టు ,రుచికి సరిపడా ఉప్పు, వెన్న ,జీలకర్ర, కరివేపాకు వేసి మిశ్రమాన్ని బాగా చేతితో కలపండి.
వెన్న బదులు కాచిన నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. సాఫ్ట్ గా అంటే మనం ఒత్తుకోవడానికి స్మూత్ గా ఉందా అన్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను పక్కన తీసుకొని మిగతా సగం తడి బట్టని వేసి ఆరకుండా పక్కన ఉంచుకోండి.
ఒక కవర్ ,పాలకవర్ గాని తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసి చిన్న ముద్దలుగా తీసుకొని, వాటిని మనం చేతితో వత్తిన, పూరి మేకర్ తో చేసుకున్న లేదా ఒక మందపాటి గిన్నెతో press చేసిన మీ ఇష్టం , ఒక వాయ సరిపడా ఆరు, ఏడు చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని కాగిన తర్వాత లో ఫ్లేమ్ లో ఆ మూకుడుకి సరిపడా వేసి లో -టు- మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ తిప్పుకుంటూ నురుగు ఆరే వరకు ఉంచి కొంచెం కలర్ వచ్చేదాకా ఉంచి తీసేయండి.