Yellow Teeth:దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటేనే మనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నలుగురిలో చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతాము. కొంతమంది దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారతాయి.
దంతాల పట్ల సరైన శ్రద్ధ లేకపోవడం, ఆహార అలవాట్లు, మద్యపానం, ధూమపానం వంటి అనేక రకాల కారణాలతో దంతాల రంగు మారుతుంది. అయితే దంతాల రంగు తొలగిపోయి తెల్లగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, అర స్పూన్ ఉప్పు, ఒక స్పూను టూత్ పేస్ట్ వేసి బాగా కలిపి ఆ తర్వాత ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి మరోసారి బాగా కలిపి టూత్ బ్రష్ సాయంతో దంతాలకు అప్లై చేసి ఒక్క నిమిషం తర్వాత సున్నితంగా తోమాలి.
ఆ తర్వాత దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే వారం రోజుల్లో గార పట్టిన పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.