దబ్బపండు రసం ప్రత్యేకించి గుండె జబ్బులను అడ్డుకొనే శక్తి ఉందని పరిశోదనల్లో తేలింది. ఇటీవల ప్రాన్స్ లో నిర్వహించిన పరిశోదనల్లో ఈ విషయాన్ని కనుగొన్నారు. ముఖ్యంగా మోనోపాజ్ దగ్గరలో ఉన్న మహిళలు క్రమం తప్పకుండా 12 ఔన్సుల దబ్బపండు రసాన్ని ఇచ్చి చూడగా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది.
గుండె రక్త నాళాలు,ధమనులు ఆరోగ్యంగా ఉండటాన్ని గమనించారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్న 48 మహిళల మీద వీరు ఈ పరిశోదనను చేసారు. వీరందరు సుమారు 50 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారే.
వీరిని రెండు గ్రూప్ లుగా విభజించి ఒక గ్రూప్ కి ఫ్లవానయిడ్స్ ఉన్న జ్యూస్ ని, మరొక గ్రూప్ కి ఫ్లవానయిడ్స్ లేని జ్యూస్ ని ఇచ్చి కొన్ని రోజుల తర్వాత గుండె పనితీరును పరిశీలన చేసారు.
ఫ్లవానయిడ్స్ కలిగి ఉన్న జ్యూస్ తాగిన వారిలో గుండె పనితీరు మెరుగుదల కనపడగా, మాములు జ్యూస్ తాగిన వారిలో కొద్దిగా మార్పును కనుగొన్నారు. దబ్బపండులోని ఫ్లవానయిడ్స్ గుండె ఆరోగ్యానికి దోహదపడుతున్నాయని వీరు గుర్తించారు. మోనోపాజ్ కి దగ్గరగా ఉన్న స్త్రీలు ప్రతి రోజు ఒక గ్లాస్ దబ్బపండు జ్యూస్ త్రాగితే మంచిదని సూచిస్తున్నారు.