
అలాంటప్పుడు ఉదయం లేవగానే తలనొప్పి, చిరాకు వంటివి వస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర రావాలంటే ఇప్పుడు చెప్పే టీ చాలా బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు టీ తాగితే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక అంగుళం దాల్చిన చెక్క ముక్క, మూడు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్, అరంగుళం అల్లం ముక్క, నాలుగు మిరియాలు వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాసు బాదంపాలు, ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్, రెండు స్పూన్ల తేనె వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఈ టీ ని వడగట్టి వేడివేడిగా రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి. ఈ టీని తీసుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టి నిద్రలేమి సమస్య అనేది లేకుండా చేస్తుంది. అంతేకాక శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.