Godhuma rava Kesari:గోధుమ రవ్వ కేసరి ఇలా చేసిచూడండి ఎంత రుచిగా ఉంటుందో..

నోముల అప్పుడు ఇంట్లో కూడా గోధుమ రవ్వ కేసరి ప్రసాదంలో చేసుకుంటాము. అంతేకాకుండా బొంబాయి రవ్వ కేసరి లాగా ఇది కూడా స్వీట్ రెసిపీ నోరూరించే రుచితో చాలా బాగుంటుంది.

కావలసినవి:
ఒక కప్పు - గోధుమ రవ్వ, నాలుగు కప్పుల - వాటర్, ఒకటి ముప్పావు కప్పు - బెల్లం, జీడిపప్పు, యాలుకలు, కిస్మిస్ నెయ్యి.

చేసే విధానం:
ముందుగా ఒక పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోండి. వాటిని తీసి పక్కన పెట్టి, ఒక కప్పు గోధుమ రవ్వ నేతిలో వేసి, కమ్మని వాసన వచ్చేవరకు వేగనివ్వండి. కొంచెం తెల్ల తెల్లగా వచ్చేవరకు వేపుకోండి .

పక్కన ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు మరిగించండి. రవ్వ వేగిన తర్వాత ఈ నీళ్లు రవ్వలో పొయ్యండి. ఉప్మాకైతే మూడు కప్పులు పోస్తాము. కొంచెం వాటర్ రవ్వలో కలుపుతూ పొయ్యాలి. ఒకేసారి వాటర్ పోయకూడదు. లో ఫ్లేమ్ లో మూత పెట్టి నీరంతా ఇగిరే వరకు ఉడికించుకోవాలి.

మూత తీసి రవ్వ సాఫ్ట్ గా ఉన్నది అని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి ముప్పావు కప్పుల బెల్లం తురుము ఈ రవ్వలో వేసుకోండి. బెల్లం మెల్లగా కరిగిపోయి జ్యూసీగా వస్తుంది. అందులో కొంచెం యాలుకల పొడి వేసుకోండి. ఈ నీరు ఇగిరేంతవరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోవాలి.

చేతికి కొంచెం పాకంలాగా చూసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి బాగా కలపెట్టి కొంచెం flexibility చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి నోరూరించే గోధుమ రవ్వ కేసరి, రవ్వ హల్వా రెడీ అయిపోయింది .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top