ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు ఒకప్పుడు ఈ నొప్పులు 60 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవడం ,జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, అధిక బరువు కారణంగా చాలా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి.
ఇలా నొప్పులు వచ్చినప్పుడు ప్రతిరోజు ఇప్పుడు చెప్పే పొడిని తీసుకుంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని ఒక కప్పు పూల్ మఖాన, అరకప్పు గింజ తీసిన ఎండు ఖర్జూరం, అరకప్పు నువ్వులు, అర కప్పు అవిసె గింజలు, ఒక కప్పు బాదంపప్పు లను విడివిడిగా వేగించుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి,
ఈ పొడిని టైట్ గ్లాస్ జార్లో నింపి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగితే ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు బలంగా మారి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.