క్యాబేజీ అంటే తినని వాళ్ళు కూడా ఇలా రైస్ చేసుకుంటే బిర్యాని flavour తో క్యాబేజీ రైస్ ఇష్టంగా తినేస్తారు.
కావలసినవి:
ఒక ఇంచు - దాల్చిన చెక్క , బిర్యాని ఆకు, లవంగాలు - నాలుగు ,రెండు ఇంచుల - అల్లం ముక్క, 10 - వెల్లులి రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, పెద్ద ఉల్లిపాయ - ఒకటి, క్యాబేజీ తురుము - నాలుగు కప్పులు, రైస్ - ఒక కప్పు, అర టీ స్పూన్ - మిరియాల పొడి, అర టీ స్పూన్ - గరం మసాలా, కొత్తిమీర కొంచెం.
చేసే విధానం:
ఒక పాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి, నాలుగు లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి రెండు నిమిషాలు పాటు వేగిన తర్వాత అల్లం ముక్కలు సన్నగా, వెల్లుల్లి ముక్కలు చిన్నవి, పేస్ట్ వేయకుండా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సేపు వేగనివ్వండి.
పచ్చిమిర్చి పొడుగ్గా చీలికలు, ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి . రెండు నిమిషాలు పాటు వేగిన తర్వాత క్యాబేజీ తురుము సన్నగా కట్ చేసుకున్నది నాలుగు కప్పులు, ఉల్లిపాయల్లో వేసి వాటిని కూడా లైట్ గా లో ఫ్లేమ్ లో దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అందులోనే మిరియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
మొత్తమంతా కలుపుకుంటూ రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి. బాగా ఉడకనవసరం లేదు కొద్దిగా సాఫ్ట్ గా అయ్యే వరకు ఉంచి, ఉడికించిన ఒక కప్పు రైస్ తీసుకొని క్యాబేజీలో వేయండి.
మొత్తం రైస్ అంతటిని కలుపుతూ మరియొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి కలపండి. కొంచెం కొత్తిమీర గార్నిష్ కి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచి ఆఫ్ చేసేయండి. మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోండి. ఈజీగా రైస్ ఐటమ్ రెడీ.


