kidney problems:కిడ్నీ సమస్యలు రావటానికి కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Kidney Problems:నూటికి 20 నుంచి 30 శాతం మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఇటివల జరిపిన సర్వేలో తెలిసింది. షుగర్,గుండె జబ్బుల తర్వాత కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కిడ్నీ సమస్యలు రావటానికి గల కారణాలు,తీసుకోవలసిన ఆహారపు జాగ్రత్తలు గురించి తెలుసుకుందాము.

కిడ్నీ సమస్యలు రావటానికి గల కారణాలు
అధిక రక్త పోటుతో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. కిడ్నీ సమస్యలు రావటానికి 50 శాతం అధిక రక్తపోటు కారణం అవుతుందని నిపుణులు చెప్పుతున్నారు. షుగర్ వ్యాది వలన కూడా కిడ్నీ సమస్యలు ఉత్పన్నం కావచ్చు. 

ఆహారంలో ఎక్కువగా ప్రోటిన్ తీసుకోవటం వలన కూడా ఈ సమస్య రావచ్చు. పాలధారిత ఉత్పత్తులు,ఎర్ర మాంసం,పాలకూర వంటి ఆహారపదర్దాలను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అంతేకాని ఎక్కువగా తీసుకోకూడదు. వీటి వలన కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తీసుకోవలసిన ఆహార జాగ్రత్తలు

నీరు
నీరు త్రాగటం మంచిదే అయినా, కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా నీరు త్రాగటం అంత మంచిది కాదు. రోజుకి ఒకటి రెండు లీటర్ల నిరు త్రాగటం సరిపోతుంది.

ప్రోటిన్స్
ప్రోటిన్స్ అధికంగా లభించే ఆహారాన్ని నెమ్మదిగా తగ్గించాలి. రోజుకి 20 నుంచి 25 గ్రాములకు మించి మాంసాహారాన్ని తీసుకోకూడదు.

కాల్షియం
కాల్షియం ఎక్కువగా లభించే వెన్న,పాలు,పెరుగు వంటి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించటానికి ప్రయత్నించాలి. అలాగని పూర్తిగా మానివేయవలసిన అవసరం లేదు.

కూరగాయలు,పళ్ళు
క్యారట్,బ్రోకిలి,క్యాలిఫ్లవర్,ఉల్లిపాయలు వంటివి సాధ్యమైనంత వరకు అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా టమోటాలు,బంగాళాదుంపలు,పాలకూర వంటి వాటికీ దూరంగా ఉండటమే మంచిది. కివి,పుచ్చకాయ,ఆపిల్,ఆరెంజ్ వంటి పళ్ళను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top