Dark Neck Home Remedies In telugu: చాలా మంది స్త్రీలు ముఖం మీద కనపరిచే శ్రద్ద మెడ మీద
చూపించరు. మెడ నల్లగా ఉన్నా,మురికిగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందముగా ఉంటే సరిపోతుందని భావిస్తారు.
కానీ మెడ అందముగా లేకపోతే దాని ప్రభావం ముఖం మీద కూడా పడుతుంది. అందువల్ల ముఖంతో సమానంగా మెడను కూడా అందముగా ఉంచుకోవాలి.
పసుపు,నిమ్మరసం సమపాళ్ళలో తీసుకోని మెడకు పట్టించి పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా కొన్నిరోజుల పాటు చేస్తే మెడ కూడా మంచి రంగుతో కనపడుతుంది.
ఏదైనా నూనెతో మసాజ్ చేసుకుంటే బాగుంటుందని నిపుణులు చెప్పుతున్నారు. మసాజ్ కారణంగా రక్త ప్రసరణ సక్రమంగా జరగటంతో పాటు మెడ మీద ముడతలను కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
నిద్రపోయే సమయంలో తల కింద తలగడ లేదా దిండు లాంటివి లేకుండా పడుకుంటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.
రోజులో కొద్దిసేపైన మెడ వ్యాయామాలు చేస్తే మంచిది. అయితే ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో చేస్తే మంచిది. ఇంటిలో మీకు తోచిన విధంగా చేస్తే మెడ అందంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
పని ప్రదేశాలలో నిటారుగా కూర్చోవటం వలన నడుము నకు మాత్రమే కాకుండా మెడకు కూడా లాభమే అని చెప్పవచ్చు. మెడ అందముగా ఉండాలంటే కూర్చునే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
బరువులు ఎత్తేతప్పుడు మోకాలు లేదా నడుము మిద ఎక్కువ బరువు వేయాలి. అంతేకాని మెడ మీద వేయకూడదు.