Methi Poori: టైంపాస్ గా తినే స్నాక్స్ ని ఆరోగ్య కరంగా తయారు చేసుకోవాలి. ఒంటికి చలువ చేసే మేథీతో పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మెంతి ఆకులు – ½ కప్పు
గోధుమ పిండి – 2 కప్పులు
కారం – ½ స్పూన్
ఉప్పు – ½ స్పూన్
సోంపు – ¼ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
పచ్చిమర్చి పేస్ట్ - 1 టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
తయారీ విధానం
1.మెంతి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
2.అందులోకి కారం ,ఉప్పు,పసుపు,బరకగా గ్రైండ్ చేసుకున్న వాము,జీలకర్ర ,పచ్చిమిర్చి పేస్ట్ ,కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
3.కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటు మెత్తగా కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు కొద్ది కొద్ది పిండితో పూరీలను వత్తుకోవాలి.
6.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోని పూరిలను ఫ్రై చేసుకుంటే కమ్మటి మేథీ పూరీలు రెడీ.