Pregnancy Care Tips:సాదారణంగా గర్భవతులు సమతుల ఆహారం తినాలని వైద్యులు సూచిస్తారు. అందుకు ఎక్కువ ఖరీదైన క్యాలిఫ్లవర్,క్యారట్ వంటివి తినాలని గర్భవతులు భావిస్తారు.
సమతుల ఆహారం అంటే క్యాలిఫ్లవర్,క్యారట్ వంటివి కాదు. మాంసకృత్తులు, పిండి పదార్దాలు,ఖనిజాలు,విటమిన్స్, ఇనుము సమృద్దిగా లభించే కూరగాయలు,పండ్లు అని అర్ధం.
గర్భవతులు గుడ్డు తింటే వేడి చేస్తుందని,పాలు పడవని అనుకుంటూ ఉంటారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. గుడ్డు మంచి పోశాఖాహారం.
ఆకుకూరలు తింటే పుట్టబోయే బిడ్డ నల్లగా పుడతారని,కుంకుమ పువ్వు తీసుకుంటే ఎర్రగా పుడతారని అనుకుంటారు. ఇందులో కూడా నిజం లేదు. పోషకాలు లభించే అన్ని రకాల కూరగాయలు,అకుకూరలను నిరబ్యాంతరముగా తీసుకోవచ్చు.
గర్భవతులు ఎక్కువగా పనిచేస్తే సుఖ ప్రసవం అవుతుందని,లేకపోతే ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ రెండు అభిప్రాయాలు తప్పే. గర్భవతులకు మధ్యాహ్నం రెండు గంటలు,రాత్రి ఎనిమిది గంటలు మొత్తం మీద రోజుకి పది గంటల విశ్రాంతి అవసరం. సరిపడా నిద్ర గర్భవతులను,వారికీ పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రసవం అయిన తర్వాత తల్లికి చాలా మంది త్రాగటానికి నీళ్ళు ఎక్కువగా ఇవ్వరు. నీరు త్రాగితే ఒళ్ళు వస్తుందని భయపెడతారు. కానీ ఇది నిజం కాదు. ప్రసవ సమయంలో ఎక్కువ శాతం నీరు పోతుంది. అందువల్ల బాలింతకు మాములుగానే నీరు ఇవ్వవచ్చు.
పాలిచ్చే తల్లులు బ్రెడ్ తింటే పాలు బాగా పడతాయనేది కూడా ఒక అపోహ మాత్రమే. బ్రెడ్ తినంత మాత్రాన పాలు రావు. బ్రెడ్ లో పిండి పదార్దం మాత్రమే ఉంటుంది. పాలిచ్చే తల్లులకు కూడా సమతుల ఆహారం ఇవ్వాలి.