Miriyala Charu Recipe : మిరియాల చారు.. 5 నిమిషాల్లో చేయొచ్చు....ఈ టిప్స్ తో చారు పెడితే అన్నమంతా ఈ చారుతోనే!

Miriyala Charu : ఈ రోజు సింపుల్ రెసిపీ మిరియాల చారు .చారు అనగానే మనం జ్వరం వచ్చినప్పుడు, పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ,ఏదైనా fry చేసుకున్నప్పుడు కాంబినేషన్ గాను చారు పెడతాం కదా , ఈసారి మిరియాల చారు పెట్టుకొని చూడండి మళ్లీ మళ్లీ ఇదే కావాలనిపిస్తుంది.

ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడిగా మిరియాల ర‌సాన్ని చేసుకుని తిన‌డం వ‌ల్ల చక్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

కావలసినవి:
ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ,ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ,ఒక స్పూన్ ఆవాలు ,పెద్ద టమాటా ముక్కలు, అర స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, పిటికెడు కొత్తిమీర, చిటికెడు ఇంగువ.
చేయు విధానం:
మిరియాలు ,జీలకర్ర ,వెల్లుల్లి వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోట్లో అయితే చాలా సువాసనతో బాగుంటుంది. మిక్సీలో కంటే రోట్లో ఏదైనా బాగుంటుంది. ఈ మసాలా ఇంకా బాగుంటుంది . ఆ తర్వాత ఒక బాండీలో ఒక స్పూన్ నూనె వేసి, ఒక స్పూన్ ఆవాలు ,అర స్పూన్ పసుపు ,3 ఎండు మిరపకాయలు, ఒక పెద్ద టమోటా ముక్కలు వేసి , ముక్కలు మెత్త పడే వరకు కలుపుకోండి.

బాగా మెత్తబడిన తర్వాత అందులో 1/2 లీటర్ వచ్చేలాగా చింతపండు నీళ్లు పోసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కచ్చాపచ్చాగా చేసుకున్న ఆ పౌడర్ని వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పిడికెడు కొత్తిమీర, పావు చెంచా ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి. అంతే వేడి వేడి మిరియాల చారు అయితే అయిదు నిమిషాల్లో రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top