Sugar Face glow tips:చక్కెర ఆరోగ్యానికి హానికరం....దాన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది...పూర్తిగా తినకుండా ఉంటే మరీ మంచిదని నిపుణులు,సర్వేలు ఒక్కటే ఉదరకోట్టేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి అంత హాని చేసే చక్కెర అందాన్ని పెంచటంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది.
ఆరోగ్యరీత్యా చక్కెర విషమే అయినా అందం దగ్గరికి వచ్చేసరికి మంచి పలితాన్ని ఇస్తుంది.
షుగర్ స్క్రబ్ ద్వారా చర్మాన్ని చాలా ప్రకాశవంతముగా,ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిమ్మరసం,తేనే సమపాళ్ళలో తీసుకోని దానికి తగినంత చక్కెర కలపాలి.
పావుగంట తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు,చేతులకు బాగా పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మం లోపలి దాకా పోయి శుభ్రం చేయటంతో పాటు మృత కణాలను కూడా తొలగిస్తుంది. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.
ఫేస్ మాస్క్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంటిలోనే చక్కెర తో ఫేస్ మాస్క్ తయారుచేసుకోవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ చక్కెర వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయుట వలన ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
బ్రౌన్ షుగర్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి మాయీశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతముగా ఉంచటమే కాకుండా తేమ ఉండేలా చూస్తుంది. బ్రౌన్ షుగర్ చర్మ రంద్రాలలో ఉన్న మురుకిని సమర్దవంతముగా తొలగిస్తుంది.