Afternoon Nap Benefits:ఉదయం సమయంలో ఉన్న చురుకుదనం,ఉత్సాహం మధ్యాహ్న సమయంలో ఉండదు. ఉదయం నుంచి పనిచేస్తూ ఉంటాం కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎక్కువగా తినేస్తు ఉంటాము. కడుపు నిండగానే నిద్ర అలా వచ్చేస్తుంది.
ఇది చాలా మందికి కలిగే అనుభూతే. ఇంటిలో అయితే ఎలాంటి సమస్య ఉండదు. అదే ఆఫీస్ లో నిద్ర వస్తే....దాని వల్ల అనేక ఇబ్బందులు,నష్టాలు ఉంటాయి. మధ్యాహ్న నిద్ర పోగొట్టటానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
సలాడ్స్ మేలు
ఉదయం తేలికపాటి బ్రేక్ పాస్ట్ తీసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం భోజనాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది మధ్యాహ్న నిద్రకు,బద్దకానికి కారణం అవుతుంది. అలా కాకుండా మధ్యాహ్న భోజనంలో సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది.
కొద్దిసేపు నడక
నిర్ణీత సమయానికి కన్నా ముందుగానే భోజనం ముగించి బయటకు వచ్చి అలా పది నిముషాలు నడవండి. ఇది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయటమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పుదినా
పుదినా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కొన్ని పుదినా ఆకులను తీసుకువెళ్ళండి. భోజనం అయిన తర్వాత వాటిని నమిలితే నిద్ర,బద్ధకం వంటివి దూరం అవుతాయి.
సెల్ ఫోన్ సంబాషణ
పని గంటలలో మీ ఆత్మీయులతో మాట్లాడే సమయం ఉండకపోవచ్చు. భోజన విరామ సమయాన్ని ఇందు కోసం ఉపయోగించండి. భోజనం అయిన తర్వాత కొంత సేపు మీ ఆత్మీయులతో మాట్లాడండి. ఇలా మాట్లాడటం వలన మీ మూడ్ బాగుంటుంది. అలాగే మీరు రిఫ్రెష్ అవవచ్చు.