Tomato fried rice: ఎవరైనా foodie గా మారిపోతారు ఇది తింటే అంత delicious గా అంత tasty గా easyగా టమాటా రైస్ చేసుకోవచ్చు. టమాటా రైస్ రెండు మూడు రకాలుగా చేయొచ్చు. కానీ రైస్ వేస్ట్ అవ్వకుండా మంచి spicy గా చేసుకుంటే చాలా బాగుంటుంది.
కొన్ని సందర్భాల్లో మనకు excess rice ఉండిపోతుంది. Relatives వచ్చినప్పుడు కొన్ని occassions లొ రైసు మిగిలిపోతుంది కదా.. అప్పుడు ఇలా వేస్ట్ చేయకుండా దాన్ని మనం మంచిగా యూస్ చేయొచ్చు.
ఒక మంచి recepie గా ప్రిపేర్ చేయొచ్చు. ఎక్కువగా పిల్లలు ఎప్పుడూ అన్నమేనా అని మారం చేస్తారు. అప్పుడు ఈ టొమాటో రైస్ ని చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది రైస్ వండి చేయొచ్చు... మిగిలిన రైస్ తోను చేయొచ్చు.
కావలసిన పదార్ధములు
ఒక కప్పు రైస్, -2 cups వాటర్, మూడు స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి తురుము, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి, రెండు టమాటోలు చిన్న ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల sezwan చట్నీ, రెండు టేబుల్ స్పూన్ల tamoto ketchep, అర టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అర టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్ ,వన్ టీ స్పూన్ Ajonmeta, అర టీ స్పూన్ సోయాసాస్, ఒక టీ స్పూన్ వెనిగర్, కొంచెం ఉల్లికాడలు
చేసే విధానం:
ముందుగా ఒక కప్పు బియ్యంని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ తీసుకొని అందులో బియ్యం వేసి రెండు కప్పుల నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
ఆ తర్వాత ఒక వెడల్పాటి బాండి లేక pan తీసుకొని మూడు స్పూన్ల నూనె వేసి బాగా కాగనివ్వాలి. తురిమిన అల్లం వేసి రెండు నిమిషాలు వేగనిచ్చి..ఆ తర్వాత వెల్లుల్లి తరుగు కూడా వేసి మరి రెండు నిమిషాలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు తరిగినవి తీసుకొని అవి కూడా ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఇంకొంచెం దోరగా వేయించుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయిస్తూ ఉండాలి .
ఉల్లిపాయ టమాటా రెండు కూడా మీడియంగా ముక్కలుగా చేసుకుంటే మనం రైస్ తినేటప్పుడు కట్స్ తగులుతూ taste గా ఉంటాయి .మరీ సన్నగా కాకుండా ముక్కలుగా చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద toast చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.
ఆ తర్వాత చల్లారిన అన్నంను పొడిపొడిగా వేసుకుంటు ఉల్లి టమాటో ముక్కల మీద వేసుకోవాలి. వేడిగా వేస్తే అది ఇంకా ముద్దగా అయిపోతుంది. కాబట్టి అన్నం చల్లారబెట్టి వెయ్యాలి. తరువాత నెమ్మదిగా ఒక్కొక్కటి sezwan tamoto ketchep, రుచికి సరిపడా సాల్ట్ వేయాలి.
ఆ తర్వాత white pepper, black pepper కూడా వేసుకుంటూ venigar, soya, ఉల్లికాడలు ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ హై ఫ్లేమ్ మీద బాగా toast గా చేసుకుంటే నూడుల్స్ ఎలా చేస్తాం.. అట్లాగా బాగా పొడిపొడిగా flavour వచ్చేవరకు ఉంచి చివరిలో గార్నిష్ గా మిగిలిన ఉల్లికాడలు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.అంతేనండి టమాటా రైస్ ప్రిపేర్ అయిపోయింది.