Wheat Rava Upma:ప్రతిరోజు బొంబాయి రవ్వ, గోధుమ రవ్వతో ఉప్మాలు తయారు చేసుకుంటూ ఉంటాం. బ్రేక్ఫాస్ట్ సమయంలో ప్రతిరోజు ఒకేలా ఉప్మాలు చేసుకుంటే బోర్ కొడుతుంది. బోర్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే విధానంలో గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు
1 కప్పు గోధుమ రవ్వ
చింతపండు – నిమ్మకాయంత
3 కప్పుల నీళ్ళు
ఉప్పు
2 tbsp నూనె
1 tsp నెయ్యి/నూనె
1 tsp ఆవాలు
1 tsp మినపప్పు
1 tsp శెనగపప్పు
3 ఎండు మిర్చి
1 tsp జీలకర్ర
1/2 cup ఉల్లిపాయ తరుగు
2 పచ్చిమిర్చి
ఇంగువ – చిటికెడు
2 రెబ్బలు కరివేపాకు
1/4 cup బటానీ
బెల్లం – గోళీ సైజు
కొత్తిమీరా- కొద్దిగా
తయారి విధానం
మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి గోధుమ రవ్వ ను వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే మూకుడులో కొంచెం నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి ఎర్రగా వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేగించాలి. ఆ తర్వాత బఠానీ వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి .ఆ తర్వాత చింతపండు పులుసు, ఉప్పు, కొంచెం బెల్లం వేసి మరిగించాలి.
మరుగుతున్న పులుసులో వేగించిన రవ్వ వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర జల్లి దించాలి. గోధుమ రవ్వతో తయారు చేసిన ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.