Bitter Gourd Seeds:చాలా మంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయ తింటే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. మనలో చాలామంది కాకరకాయ కూర వండేటప్పుడు కాకరకాయ గింజలను పా డేస్తూ ఉంటారు.
కానీ కాకర గింజల్లో ఇంకా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాకరకాయ గింజలు తీయకుండా కూర వండుకోవాలి. కాకరకాయ గింజలు ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
డయాబెటిక్ పేషెంట్లలో సాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్యలు తగ్గిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కాకరకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.