Tutti Frutti Cake Recipe:మెత్తటి స్పాంజ్ లాంటి టూటీ ఫ్రూటీ కేక్ ఈజీ స్టెప్స్ తో .. ఓవెన్ లేకుండా

Tutti Frutti Cake:టూట్టి ఫ్రూటీ కేక్.. ఈ రోజుల్లో కేక్స్ ,బేకరి ఐటెమ్స్ చిరుతిండి లో భాగమై పోయాయి. వారంలో ఒక సారైనా బేకరికి వెల్లకుండ ఉండలేరు. బేకరి ,ఓవెన్ అవసరం లేకుండా టూటీ ఫ్రూటీ కేక్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 1 ½ కప్పు
చక్కెర – 1 కప్పు
పెరుగు – 1 కప్పు
బేకింగ్ పౌడర్ – 1 స్పూన్
బేకింగ్ సోడా – ½ స్పూన్
వెనిలా ఎసెన్స్ – 1 స్పూన్
బటర్ – ½ కప్పు
టూట్టి ఫ్రూటీస్ – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా పెరుగు ,చక్కెర పొడి ను మిక్సింగ్ బౌల్ వేసి కలుపుకోవాలి.

2.అందులోకి బేకింగ్ పౌడర్ ,బేకింగ్ సోడా వేసి కలుపుకోని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

3.ఇప్పుడు గిన్నెలోకి టూట్టి ఫ్రూటీస్ 1 ½ టీ స్పూన్ మైదా వేసి మిక్సి చేసుకోవాలి.

4.ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకోని అడుగున ఆయిల్ అప్లై చేసి మైదా చల్లుకోవాలి.

5.బేకింగ్ కోసం మందపాటి అడుగు గల బాండీ తీసుకోని పదినిమిషాలు వేడి చేసుకోవాలి.

6.ఇప్పుడు బేకింగ్ ట్రే లోకి పెరుగు ,చక్కెర మిశ్రమంలోకి వెనిలా ఎసెన్స్,కరిగిని బటర్ చిటికెడు ఉప్పు 1 ½ కప్పు మైదా వేసి మిక్స్ చేసుకోవాలి.

7.ఇప్పుడు అందులోకి ప్రిపేర్ చేసుకున్న టూట్టీ ఫ్రూటీలను కేక్ పై వేసుకోవాలి.

8.తయారు చేసుకున్న ట్రే వేడి చేసుకున్న బాండి లో స్టాండ్ సాయంతో ప్లేస్ చేసుకోని 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.

9. అరగంట తర్వాత చాక్ తో గాని టూత్ పిక్ తోగాని చెక్ చేసుకోని కేక్ బేక్ అయ్యింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

10.ట్రే ని ప్లేట్ లోకి బోర్లించి తర్వాత వేరోక ప్లేటోలోకి బోర్లించుకుంటే కలర్ ఫుల్ టూట్టి ఫ్రూటీ కేక్ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top