Sweet Carrot Rolls:పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ క్యారట్ రోల్స్.. సూపర్ గా ఉంటాయి

Sweet Carrot Rolls: స్వీట్ క్యారెట్ రోల్స్.. పిల్లల కోసం రోజు కొత్త కొత్త స్నాక్స్ కోసం వెతుక్కోవాలే. హెల్గీగా ఉండాలి అలాగే అట్రాక్టివ్ గా కూడ ఉండాలి. పిల్లల స్నాక్స్ కి పర్ ఫెక్ట్ గా సూటయ్యే క్యారెట్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 ½ కప్పు
తురిమిన క్యారెట్ – 1 కప్పు
కొబ్బరి పొడి – ½ కప్పు
తురిమిన బెల్లం – 1 కప్పు
పల్లీలు – ½ కప్పు
యాలకుల పొడి – 1 స్పూన్
ఉప్పు – చిటికెడు
సోడా – ½ స్పూన్

తయారీ విధానం

1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండి వేసి అందులోకి ఉప్పు,సోడా నెయ్యి వేసి కొద్ది కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోని పిండిని మెత్తగా కలుపుకోవాలి.

2.కలుపుకున్న పిండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.

3.ఇప్పుడు పల్లీలను ప్యాన్ లో వేసుకోని దోరగా వేపుకోని మెత్తని పొడి గ్రైండ్ చేసుకోవాలి.

4.ప్యాన్ లో స్పూన్ నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి.

5.అందులోకి క్యారేట్ తురుము వేసి కాస్తా వేపుకున్నాక బెల్లం యాడ్ చేసుకోని వేపుకోవాలి.

6.బెల్లం కరిగి మెల్ట్ అవుతుండగా అందులోకి కొబ్బరి పొడిని కూడ యాడ్ చేసుకోని వేపుకోవాలి.

7.ఇప్పుడు అందులోకి పల్లీ పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

8.కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

9.ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకోని పూరిలా వత్తుకోవాలి.

10.వత్తుకున్న పూరిలో చల్లారిన స్టఫ్ ని వేసి పూరి ఎడ్జెస్ నీళ్ల తడితో మూసి వేసి రోల్స్ లా తయారు చేసుకోవాలి.

11.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి అందులోకి తయారు చేసుకున్న రోల్స్ ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి.

12.అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ క్యారెట్ రోల్స్ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top