Mamidikaya Rasam: మామిడి కాయ రసం.. సీజన్ లో దొరికే మామిడి కాయలతో నిల్వ పచ్చల్లు ,రోటి పచ్చల్లు చేస్తునే ఉంటాం. అలాగే పచ్చి మామిడికాయలతో రసం చేసి చూడండి పుల్లపుల్లగా టేస్ట్ అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
మామిడి కాయలు – 1
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3-4
కరివేపాకు – ½ కప్పు
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
కారం – 1 స్పూన్
ధనియాలు – 1 స్పూన్
జీలకర్ర,మెంతుల పొడి – ¼ టీ స్పూన్
నువ్వులు – 2 టీ స్పూన్స్
బెల్లం -2 స్పూన్స్
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా పచ్చి మామిడి కాయలను పిక్కతో సహా గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోని పది నిమిషాల పాటు ఉడకించుకోవాలి.
2.ఉడికిన మామిడి కాయలను గుజ్జుపిండుకోని పిక్కలను తీసివేయాలి.
3.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,ఆవాలు ,ఎండుమిర్చి,ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి కరివేపాకు ,పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.
5.వేగిన తాలింపులోకి మామిడి కాయ రసం వేసి తగినన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి.
6.అందులోకి సరిపడా ఉప్పు,మిరియాల పొడి,కారం,జీలకర్ర మెంతుల పొడి,నువ్వుల పొడి ,బెల్లం వేసి బాగా కలుపుకోని ఇరువై నుంచి ఇరువై ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే వేడి వేడి మామిడి కాయ రసం రెడీ.