Dates Rolls:ఖర్జూర రోల్స్.. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరంతో కాస్త వైరైటిగా స్వీట్ తయారుచేసుకుందాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్ధాలు
ఖర్జూరాలు - అర కేజీ
పాలు - లీటరు
అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ - అర కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు,
అలంకరణ కోసం కొబ్బరి పొడి
తయారు చేసే విధానం
ఖర్జూరాల్లోని గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నెయ్యి వేసి ఖర్జూరం ముక్కలను తక్కువ మంట మీద 20 నిముషాలు వేగించాలి. ఇవి కొంచెం మెత్తగా అయ్యాక పాలు పోయాలి.
ఈ మిశ్రమం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత డ్రైఫ్రూట్స్ పలుకులను కలిపి స్టౌ మీద నుండి దింపేయాలి. వేడి తగ్గాక చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టాలి. వీటిని రోల్స్‌లా చుట్టుకుని కొబ్బరి పొడిలో దొర్లించాలి. అంతే నోరురుంచే ఖర్జూర రోల్స్ రెడీ.