Milk Chocolate:బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనే చాక్లెట్లను ఇలా ఈజీగా ఇంట్లోనే చేయండి

Milk Chocolate: పాల చాక్లెట్.. బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనే చాక్లెట్లను ఇలా ఈజీగా ఇంట్లోనే చేయండి. చాలా సులభంగా చేసేయవచ్చు.

కావలసిన పదార్దాలు
పాలు - కప్పు
పెరుగు - కప్పు
పంచదార - కప్పు
నెయ్యి - చెంచా
యాలకులపొడి - కొద్దిగా.

తయారీ విధానం
ఒక గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఆ తర్వాత పెరుగు, పంచదార, యాలకులపొడి ఒక దాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలపాలి. 

ఈ మిశ్రమం బాగా దగ్గరగా వచ్చిన తరువాత కొంచెం నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారాక అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని బిళ్లల్లాగా చేసుకోవాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాల చాక్లెట్ రెడీ. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top