Scrubs for soft feet: వాన కాలంలో పాదాలు ఎక్కువగా నానుతాయి. దీని వలన పాదాలు మృదుత్వాన్ని కోల్పోయి అందవిహీనంగా మారతాయి. ఇటువంటి సమయంలో మనం జాగ్రత్తగా లేకపోవటం వలన పగుళ్లకు దారి తీయవచ్చు.
అప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే పగుళ్ళ బారి నుండి మన పాదాలను కాపాడుకోవచ్చు. ఒక పెద్ద గిన్నెలో పాదాలు మునిగేలా నీరు పోసి రెండు స్పూన్ ల ఉప్పు ,రెండు స్పూన్ ల బేకింగ్ సోడా, రెండు స్పూన్ ల లావేందర్ ఆయిల్ వేసి పాదాలను 20 నిముషాలు ఉంచాలి.
దీని వలన వర్షం కారణంగా పాదాలు తడవటం వలన వచ్చే పంగస్, వాసన దురం అవుతాయి.
అలాగే టీ బ్యాగ్స్ ను వేడినీటిలో ఉంచి పాదాలను పది నిముషాలు ఉంచిన సరిపోతుంది.
వారానికి రెండు సార్లు స్క్రబ్ చేస్తే మృత కణాలు, మురికి పోయి అక్కడ చర్మం మృదువుగా మారుతుంది. స్క్రబ్ చేసుకున్న తర్వాత పాదాలను వేడి నీటిలో కడగటం మాత్రం మర్చిపోకూడదు.