Hair Care Tips:పట్టుకుంటే పట్టులా జారిపోయే జుట్టు మీకు సొంతం కావాలన్నా,సహజమైన రంగుతో మీ జుట్టు ఎప్పుడు నిగనిగలాడుతూ కనిపించాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి.
ఒక మగ్ నీటిలో గుడ్డులోని తెల్లసొనను వేసి బాగా గిలకొట్టి తలస్నానం చేసిన తర్వాత ఆ నీటిని జుట్టు అంతా తడిసేలా పోసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టుకి పట్టు లాంటి మృదుత్వం వస్తుంది.
ఆముదం,తేనే సమపాలల్లో తీసుకోని కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు చివర్లు చిట్లకుండా మృదువుగా ఉంటాయి.
బీట్ రూట్ ని పేస్ట్ చేసి నీటిలో మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి రాత్రి పడుకొనే సమయంలో మాడుకు పట్టించి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయమే తలస్నానం చేయాలి.
ఎర్రటి బంతి పూలను వేసి మరిగించిన నీటిని మాడుకు,జుట్టుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే తెల్లపడిన వెంట్రుకలు ఎర్రగా మారతాయి. ఇది జుట్టుకు రంగు వేసుకొనే వారికి అర్గానిక్ హెయిర్ డ్రై గా సహాయపడుతుంది.