selfies: సెల్ఫీ లు అంటే సరదాగా తీసుకొనే స్వీయ పొటోలే కాదు. అవి మన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మనలోని అంతర్ముఖం, అంకిత భావం, స్వార్ధం, నిస్వార్ధం, దైర్యం,పిరికితనం ఇలా ఎన్నో లక్షణాలనుసెల్ఫీ చెప్పుతుందట.
ఫోటో అని అనుకుంటాం కానీ అది మనలోని ఎన్నో కోణాలను బయట పెడుతుంది. సెల్ఫీ కోసం ఎంచుకున్న ప్రదేశం, భంగిమ,కెమరా పనితనం వంటి విషయాలు మన వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయట. ఇతర వ్యక్తులు తీసే ఫోటోల కన్నా సెల్ఫీ లే వ్యక్తిత్వాన్ని అంచనా వేయటంలో సూచికలుగా ఉంటాయి.
సంతోషంగా నవ్వు ముఖంతో ఉంటే సానుకూల దృక్పదం కలిగి ఉండటంతో పాటు ఇతరులకు సాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
ముఖం కింద నుంచి సెల్ఫీ తీసుకుంటే పట్టు విడుపు లేని దోరణి కలిగి ఉండటం, సరికొత్త ప్రయోగ దృక్పదాన్ని తెలియజేస్తుంది. ప్రేవేట్ ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోకపోవటం అనేది మనసాక్షికి విలువ ఇచ్చే దోరణికి అద్దం పడుతుంది. అయితే ఇవి కొన్ని ఊదహరణలు మాత్రమే.

