Diabetes Foot Ulcers : షుగర్ వ్యాధి దీర్ఘ కాలం ఉంటే శరీరంలోని రక్త నాళాలను, నరాలను దెబ్బతీస్తుంది. తొలి దశలో నరాలు మాత్రమే దెబ్బతింటాయి. ఆ తర్వాత అప్పుడప్పుడు కాళ్ళు
తిమ్మిరి ఎక్కటం,మొద్దుబారటం వంటివి జరుగుతాయి.
షుగర్ వచ్చిన 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత పాదాలు స్పర్శ కోల్పోవటం జరుగుతుంది. దాని వలన తెలియకుండానే చెప్పులు కాలి నుండి జారిపోవటం వంటి లక్షణాలు కనపడతాయి.
వ్యాధి తీవ్రమైతే పాదాలు స్పర్శను చాలా వరకు కోల్పోయి కాలికి దెబ్బ తగిలినా లేదా వేడి వస్తువులు తగిలినా నొప్పి తెలియదు. ఈ విధంగా నొప్పి తెలియని గాయాలు బాగా పెద్దవి అవుతాయి.
వీటిని న్యూరో పథిక్ గాయాలు అని అంటారు. షుగర్ వ్యాధి పది సంవత్సరాలు కంటే ఎక్కువ రోజులు ఉంటే కాలి నరాలతో పాటు రక్త నాళాలు కూడా బాగా దెబ్బతింటాయి. ఇంతకు ముందు ఏర్పడ్డ న్యూరో పథిక్ గాయాలు నయం కావాలంటే నరాలు పునరుత్తేజం కావాలి.
అయితే నరాలకు శక్తి రావాలంటే రక్త ప్రసరణ కీలకం. కానీ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్త నాళాల్లో కొవ్వు చేరటం వలన కండరాలు శక్తిని కోల్పోతాయి.
కాలి కండరాలలో బలం,సమతుల్యం లోపించటం వలన కళ్ళు వంకర్లు తిరిగిపోతాయి. ఈ విధంగా వంకర్లు తిరిగిన ప్రాంతంలో పుండు ఏర్పడుతుంది. దీనిని అశ్రద్ద చేస్తే ఆ బాగం కుళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ వ్యాది ఉన్నవారు డాక్టర్ చెప్పిన సలహాలను పాటించి పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.