Joint Pains Home Remedies: గతంలో మోకాళ్ళ నొప్పులు వయస్సు మళ్ళిన వారికీ మాత్రమే వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మారిన జీవన పరిస్థితులు,విధానాల వల్ల మోకాళ్ళ నొప్పులు చిన్న వయస్సులోనే చుట్టుముట్టుతూ ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో ఇవి మొండివ్యాదిగా మారి దీర్ఘకాలంగా బాధపెడుతూ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వ్యక్తులు ఎక్కువసేపు నడవలేరు.అలాగే కోర్చోలేరు. ఆఖరికి ఎక్కువసేపు కూడా నిద్రపోలేరు. అలాంటి మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందటానికి కొన్ని సూచనలను పాటించాలి.
వెళ్లుల్లి
వెళ్లుల్లి లోని పోషకాలు కీళ్ళను ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తాయి. కీళ్ళు ఆరోగ్యంగా ఉంటే నొప్పులు దరిచేరవు. ప్రతిరోజూ 3లేదా 4వెళ్లుల్లి రెబ్బలను తీసుకుంటే మంచి పలితం ఉంటుంది.
తేనే
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే కలిపి ఉదయాన్నే త్రాగితే మంచిది. అలాగే రోజు విడిచి రోజు గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని త్రాగిన మంచి పలితం ఉంటుంది.
హెర్బల్ ఉత్పత్తులు
ఆశ్వగంద,షల్లకి రెండు పొడులు మోకాళ్ళ నొప్పులు తగ్గించటానికి సహాయపడతాయి. ఒక గ్లాస్ నీటిలో ఈ రెండు పొడులను కలిపి ప్రతి రోజు త్రాగితే మంచి పలితాన్ని పొందవచ్చు.
పళ్ళు,కూరగాయల రసాలు
పైనాపిల్ లేదా ఆపిల్ జ్యూస్ ను ప్రతి రోజు త్రాగితే ఆరోగ్యంతో పాటు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. కురగాయాలలో బీట్ రూట్,క్యారట్ జ్యూస్ లు మోకాళ్ళ నొప్పిని,వాపును తగ్గిస్తాయి.
వాతావరణం
మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు చలి వాతావరణంలో అసలు ఉండకూడదు. శరీరాన్ని ఎప్పుడు వెచ్చగా ఉంచుకోవాలి.
ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు
ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు కీళ్ళను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా కిల్లా నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు లభించే చేపలను వారంలో రెండు సార్లు తింటే మంచిది.