Paneer 65 Recipe:పన్నీరు తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటూ ఉంటాం. రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా పనీర్ 65 తయారుచేసుకోవచ్చు. దీని తయారికి కావలసిన పదార్ధాలు,తయారి విధానం చుసేయండి.
కావలసిన పదార్దాలు
పన్నీర్ ముక్కలు - 1 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 కప్పు
మైదా - 4 స్పూన్స్
కారం - 2 స్పూన్స్
ధనియాల పొడి - 2 స్పూన్స్
అమ్ చూర్ పొడి - 2 స్పూన్స్
కొత్తిమీర కట్ట
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేయువిధానం
ముందుగా పన్నీరు ముక్కలను వేడి నీటిలో వేసి 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టాలి .ఒక బౌల్ తీసుకుని కార్న్ ఫ్లోర్ ,మైదా,ధనియాలపొడి ,అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,గరం మసాల,ఉప్పు వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి .
స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పైన తయారుచేసుకున్న పిండిలో పన్నీర్ ముక్కలు ముంచి నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. వీటి అన్నింటిని ఒక బౌల్ లోకి తీసుకోని అమ్ చూర్ ,సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే పన్నీర్ 65 రెడీ అవుతుంది. దీనికి టమాటో సాస్ మంచి కాంబినేషన్.