Protein Dosa:మామూలు దోశకంటే మించినరుచితో పోషకాలతో నిండిన పప్పులదోస..

Breakfast Protein Dosa: బ్రేక్ ఫాస్ట్ కి మనం ఎక్కువగా మినపట్టు ,పెసరట్టు , రవ్వ దోశ ఇలా రకరకాల దోశలు , మైదాతో దోశె ,గోధుమపిండి దోశలు చేసుకుంటాం కదా. వీటి లాగానే పప్పుల దోశ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. 

అన్ని రకాల పోషకాలు అందుతాయి. దోశె తిన్నట్టు ఉంటుంది. ఇది ఎలాగో చూద్దాం. ఈ దోశె కి కాంబినేషన్ వెజిటబుల్ చట్నీ కూడా చేసుకోండి.

కావలసినవి:
బియ్యం, మినుప గుళ్ళు, పెసరపప్పు ,సగ్గుబియ్యం, అటుకులు, కందిపప్పు, బొబ్బర్లు, సెనగలు, ఉలవలు ఏముంటే అవి మన దగ్గర ఉన్న వాటిని బట్టి హెల్దిగా ఉండేవి కలుపుకోవాలి. దీనికి కాంబినేషన్ వెజిటబుల్ చట్నీకి ఉల్లిపాయలు ,క్యాప్సికం, పచ్చిమిర్చి, కరివేపాకు ,చింతపండు, ఉప్పు, కారం, పసుపు ,తాలింపులు.

చేసే విధానం:
ఒక కప్పు రైస్ ఏ rice అయినా పర్వాలేదు హెల్దీ కావాలనుకున్న వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోండి. ఒక పావు కప్పు మినప గుళ్ళు లేదా పొట్టు మినప్పప్పు పప్పు ఉంటే అది హెల్దిగా తీసుకోవచ్చు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు తెల్లబటాని లేక ఒక కప్పు కాబూలీ సెనగలు, పెసరపప్పు అయినా ముడి పెసరపప్పు అయినా పర్వాలేదు, పావు కప్పు ఉలవలు లేక ఉలవలకి బదులు బొబ్బర్లు కానీ అలసందలు కానీ తీసుకోండి.

రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం ,పావు కప్పు అటుకులు, అటుకులు వేరేగా తడిపి కడిగి కలపాలి. ఈ పప్పులన్నీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తడిపిన అటుకులు కూడా అందులో వేసి మొత్తం కి నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి.

మార్నింగ్ కావాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి నైట్ కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మనం మిక్సీ వేసిన తర్వాత వెంటనే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత మిక్సీ వేసేటప్పుడు ఒక రెండు, మూడు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి.

అన్నీ కలిపి మెత్తగా దోశ బెటర్ లాగా చేసుకుని ఒక దోస లాగా ఒక గరిట వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ లైట్ గా వేసుకొని అటు ఇటు కూడా తిప్పుకొని తీసుకుంటూ క్రిస్పీగా కలర్ ఫుల్ గా ఉంటుంది.

దోసె హల్దీగా కూడా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఏ చట్నీ అయిన పర్వాలేదు. ఇక్కడ వెజిటబుల్ చట్నీ తయారీ కూడా చూద్దాం.

వెజిటబుల్ చట్నీ చేసే విధానం:
స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని 8 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి, రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ,హాఫ్ కప్పు కరివేపాకు కడిగి వేసుకోవాలి ,రెండు పెద్ద క్యాప్సికంని ముక్కలుగా ఉల్లిపాయలు లాగే కొంచెం పెద్ద ముక్కలుగా వేసి వేపుకోవాలి.

మూత పెట్టి ఉంచుకోవాలి . రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ,ఒక స్పూన్ జీలకర్ర ,నిమ్మకాయ సైజు చింతపండు ,ఆరు వెల్లుల్లి రేకలు వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొంచెం పోపు పెట్టుకుంటే అంతే.....
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top