Carrot saggubiyyam vadiyalu:కమ్మనైన క్యారెట్ సగ్గుబియ్యం వడియాలు ఈ టిప్స్ ఫాలో అయితే విరిగిపోకుండా వస్తాయి

Carrot saggubiyyam vadiyalu:ఎప్పుడు రొటీన్ గా ఒకే వంట ఒకే రెసిపీలు బోర్ గా ఉంటాయి. కాబట్టి మనం పెట్టుకునే వాటిని కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఒక డిఫరెంట్ రెసిపీస్ లాగా ఉంటాయి. డిఫరెంట్ టేస్ట్ లు మనకు తెలుస్తూ ఉంటాయి.

ఈ రెసిపీలో మనం క్యారెట్ ఆడ్ చేయడం వల్ల కలర్ ఫుల్ గా కనిపిస్తాయి .టీ బ్రేక్, స్నాక్స్ లాగా కూడా లైట్ గా రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని కూడా తింటే బాగుంటాయి.

కావలసినవి:
పావు కిలో సగ్గుబియ్యం, 8 ,9 కప్పులు నీళ్లు, ఒక అర కప్పు క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, జీలకర్ర.

చేయు విధానం:
సగ్గుబియ్యము ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. ఒక కప్పు సగ్గుబియ్యం కి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కనీసం నాలుగు గంటలు పాటు నానబెట్టాలి. లేదా ఒక నైట్ నాన పెట్టుకోండి.

ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకుంటూ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం పేస్టు పల్చగా ఉండాలి. దోస పిండి మీద ఇంకొంచెం జారుగా ఉండేలా చూసుకోవాలి .రెండు కప్పులు నీళ్లు నాన పెట్టడానికి, ఒక కప్పు నీళ్లు మిక్సీలో బ్లెండ్ చేసినప్పుడు, ఇంకొక కప్పు జారు చేసుకోవడానికి మొత్తం నాలుగు కప్పులు నీళ్లు ఇక్కడితో వాడాం.
దీన్ని పక్కన పెట్టేసుకుని మళ్లీ మిక్సీ జార్ లో ఆరేడు పచ్చిమిరపకాయలు, 2 inch అల్లం ముక్కలు, ఉప్పు చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని వెడల్పాటి పాను తీసుకొని దాంట్లో ఒక నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి.

అది మరుగుతూ ఉండగా సగ్గుబియ్యం పేస్ట్ వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి. పిండి పల్చగా ఉందో గట్టిగా ఉందో గమనించుకొని దాని ప్రకారం నీళ్లు పోసుకోవాలి. అది పలచగా ఉంటే నీళ్లు పోయినవసరం లేదు. గట్టిగా ఉంటే ఇంకొక కప్పు నీళ్లు పోసి ఇంకొంచెం సాఫ్ట్ గా వచ్చేలాగా కలుపుకోవాలి.

వడియాలు విరగకుండా రావాలి అంటే ,పిండి బాగా ఉడకాలి. అప్పుడే వడియం అనేది ఇరగకుండా వస్తుంది .ఒక 20 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక్క స్పూన్ సాల్ట్ కూడా వేయొచ్చు. ఒక స్పూన్ జీలకర్ర ,మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి .

రెండు మీడియం సైజ్ క్యారెట్లను కూడా తీసుకొని కొంచెం లావుగానే తురుముకోండి .తురిమిన క్యారెట్ ని ఆ పిండిలో కలిపేసుకోండి. ఒక్క స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకుంటే వడియాలు తెల్లగా వస్తాయి. అక్కర్లేదు అనుకుంటే మానేయొచ్చు. సగ్గుబియ్యం ఎంత తీసుకుంటే అందులో సగం క్యారెట్ తురుము తీసుకుంటే బాగా కనిపిస్తాయి.

ఈ వడియాల పిండి cosistency ఎలా చూసుకో వాలంటే ఒక plate తీసుకొని ఒక గరిటీ పిండి పోస్తే అది బాగా extend అవ్వకుండా ఎంతవరకు వేస్తే అంతవరకే ఉండాలి. బాగా పాకి పోకుండా ఉండకూడదు. ఒక కాటన్ క్లాత్ తీసుకొని రెండు పొరలుగా వేసుకొని ఒక్కొక్క గరిట ఒక్కొక్క వడియము అంటుకోకుండా పెట్టుకోవాలి .

ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా ఇవి ఆరిపోతాయి. క్లాత్ మీద పెట్టాం కాబట్టి మరుసటి రోజు క్లాత్ వెనక్కి తిప్పి కొంచెం నీళ్లు చిమ్ముకుంటూ ఒక్క నిమిషం ఆగి తీశారంటే చక్కగా వచ్చేస్తాయి. వాటిని మళ్లీ రెండు రోజులు ఆరబెట్టుకోండి. కలర్ ఫుల్ క్యారెట్ సగ్గు బియ్యం వడియాలు రెడీ...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top