Garlic Curry:ఇంట్లో కూరగాయలు లేకపోయినా 10ని||ల్లో కూర చేయాలంటే చపాతీ అన్నంలోకి Instant Garlic Curry చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. కాబట్టి ఒకసారి గార్లిక్ కర్రీ ని ప్రయత్నించండి
కావలసిన పదార్ధాలు
వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా.
చింతపండు - 75 గ్రా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
మెంతులు - టీ స్పూన్
సోంపు - అర టీ స్పూన్
కరివేపాకు - రెమ్మ
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 3 (నిలువుగా కట్ చేయాలి)
కారం - అర టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
టొమాటో - 2 (సన్నగా తరగాలి)
తయారీ విధానం
చింతపండులో వేడినీళ్లు పోసి, అరగంట సేపు నానబెట్టాలి. దాని నుండి గుజ్జు తీసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి 50 గ్రా.ల వెల్లుల్లి రెబ్బలను వేగించాలి. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి,మెంతులు వేసి వేగించాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ గా చేయాలి.
అదే బాణలిలో మిగతా నూనె వేసి మెంతులు,సోంపు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంత సేపు వేగించాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు, టమోటా ముక్కలు వేసి ఉడికించాలి.
దీనిలో వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు, తగినంత నీరు పోసి సిమ్ లో పెట్టి పావుగంట ఉడికించాలి. వెల్లుల్లి బాగా ఉడికి మిశ్రమం చిక్కబడ్డాక పొయ్యి మీద నుంచి దించేయాలి. కొత్తిమీర తో గార్నిష్ చేయాలి. ఈ కర్రీ చపాతీ, ఫ్రైడ్ రైస్ లకు మంచి కాంబినేషన్.